వరదలు వర్షాలతో ముగ్గురి మృతి

- December 03, 2016 , by Maagulf
వరదలు వర్షాలతో ముగ్గురి మృతి

రియాద్‌: గడచిన 24 గంటల్లో ముగ్గురు మృతి చెందగా 335 మందిని సురక్షితంగా వర్షాలు, వరదల నుంచి రక్షించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మక్కాలో ఇద్దరు, రియాద్‌లో ఒకరు చనిపోయినట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ డిఫెన్స్‌ వెల్లడించింది. రియాద్‌లో 302 మందిని రక్షించగా, మక్కాలో ఇద్దరిని, ముగ్గురిని జజాన్‌లోనూ, ఇద్దరిని తాబుక్‌లోనూ, 21 మందిని ఈస్టర్న్‌ ప్రావిన్స్‌లో అలాగే ఐదుగుర్ని అసిర్‌లో రక్షించారు. నీరు నిలిచిపోవడంతో వాహనాల్లో ఇరుక్కుపోయినవారే ఇందులో ఎక్కువ. 330 వాహనాలు నీటిలో నిలిచిపోయాయి. 119 కుటుంబాల్ని వరద ముంపు కారణంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాతావరణంలో మార్పుల కారణంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సివిల్‌ డిఫెన్స్‌ సూచిస్తోంది. భారీ వర్షాలు వరదలతో వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయినట్లు రియాద్‌లోని సయ్యద్‌ హమీద్‌ మౌలానా అనే బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌ తెలిపారు. ప్రజల్ని అప్రతమత్తం చేసేందుకు ఎప్పటికప్పుడు సివిల్‌ డిఫెన్స్‌ పరిస్థితిని సమీక్షిస్తోంది. భారీ వర్షాలు, వరదలపై హెచ్చరికలు చేస్తూ, ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com