గుండెపోటుకు గురైన సీఎం జయలలిత

- December 04, 2016 , by Maagulf
గుండెపోటుకు గురైన సీఎం జయలలిత

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు సీఎం జయలలిత హఠాత్తుగా గుండెపోటుకు గురైన విషయం తెలియడంతో రాష్ట్రం నలుమూలల నుంచి అపోలో ఆస్పత్రికి జనం పోటెత్తారు. లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. మహిళలూ పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకొన్నారు. అమ్మ పరిస్థితిని తెలుసుకొనేందుకు అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. 'అమ్మ ఆరోగ్యంగా తిరిగి రావాలి' అని కాంక్షిస్తూ పలువురు మహిళలు ఆస్పత్రి వద్ద ప్రార్థనలు చేశారు. మరికొందరు జయ ఫొటోలను ప్రదర్శిస్తూ లాంగ్‌ లీవ్‌ అమ్మ అంటూ నినాదాలు చేశారు. ఆస్పత్రి లోపలికి చొరబడేందుకు ప్రజలు, అన్నాడీఎంకే కార్యకర్తలు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.

దీంతో పలువురు గాయపడ్డారు. ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పరిస్థితిని అదుపు తప్పకుండా చూసేందుకు ఆస్పత్రి లోపల, వెలుపల భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఆస్పత్రి చుట్టుపక్కల ఉన్న హోటళ్లను, కార్యాలయాలను పోలీసులు మూసివేయించారు. ఆస్పత్రికి దారితీసే ప్రధాన రహదారులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పెద్ద ఎత్తున బారీకేడ్లను ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రికి అపోలో వద్ద అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com