జయలలిత ఆరోగ్య పరిస్థితి పై అపోలో సిబ్బంది బులెటిన్
- December 04, 2016
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆస్పత్రి వైద్యులు తాజాగా ఓ ప్రకటన చేశారు. జయలలితకు యాంజియోగ్రామ్ విధానం ద్వారా చికిత్సనందిస్తున్నామని వైద్యులు తెలిపారు. 24 గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు ప్రకటించారు. జయలలిత త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేయాలని అపోలో వైద్యులు సూచించారు. మధ్యాహ్నం 12 గంటలకు హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇదిలా ఉంటే, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమంగా ఉందంటూ వార్తలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అపోలో ఆస్పత్రి వద్ద 3000 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. ఆస్పత్రి చుట్టుపక్కల ఉన్న హోటల్స్‌ను, దుకాణాలను ఖాళీ చేయించారు. సీఎం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







