ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాదీవుల్లో తీవ్ర భూకంపం ..
- December 06, 2016
ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాదీవుల్లోని ఆసె ప్రావిన్స్‌లో బుధవారం తెల్లవారుజామున తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది. ఈ విషయాన్ని అమెరికా భూభౌతిక సర్వే సంస్థ కూడా ధ్రువీకరించింది. ఇప్పటి వరకు భూకంపం కారణంగా 20మంది మృతి చెందగా, పలువురు గాయాలపాలయ్యారు.మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, ఇప్పటికైతే ఎటువంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు. ఇండోనేషియా స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5.03 గంటల సమయంలో 33 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు గుర్తించారు. భూకంపకేంద్ర ప్రాంతానికి దాదాపు 836 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు దీని ప్రభావానికి గురయ్యారు.ఈ భూకంపం వల్ల ఆస్ట్రేలియాకు ఎటువంటి సునామీ ముప్పులేదని శాస్త్రవేత్తలు ప్రకటించారు. కొన్ని వారాల క్రితం న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది.
2004లో ఆసె ప్రాంతంలో ఒకసారి సునామీ వచ్చి భారీ నష్టాన్ని మిగిల్చిని విషయం తెలిసిందే. అప్పట్లో దాదాపు 30మీటర్ల ఎత్తున భారీ అలలు విరుచుకుపడటంతో దాదాపు 1,70,000 మంది చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. అదే సమయంలో భారత్‌లో దాదాపు 8,000 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







