కొత్త రూ.100 నోట్లనూ విడుదల చేయనున్న ఆర్బీఐ..

- December 06, 2016 , by Maagulf
కొత్త రూ.100 నోట్లనూ విడుదల చేయనున్న ఆర్బీఐ..

 పాత నోట్లు రూ.500, రూ.1000 రద్దుతో ఏర్పడిన నగదు కొరతతో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మరో కీలక ప్రకటన చేసింది. మహాత్మాగాంధీ సిరీస్ -2005లో కొత్త రూ.100 బ్యాంకునోట్లను జారీచేయనున్నట్టు ఆర్ బీఐ వెల్లడించింది. ఈ కొత్త నోట్లలో నంబర్ ప్యానెల్స్ ఇన్ సెట్ లెటర్లు ఏమీ ఉండవని తెలిపింది. అయితే పాత రూ.100 నోట్లు చట్టబద్ధమైన కరెన్సీలాగానే కొనసాగుతాయని ఆర్ బీఐ పేర్కొంది. పాత నోట్ల రద్దు అనంతరం రూ. 500, రూ.2000 కొత్త నోట్లను ఆర్బీఐ విడుదలచేసింది.కానీ అవి తక్కువ మొత్తంలో విడుదల కావడంతో నగదు కొరత ఏర్పడింది. మరోవైపు పెద్ద నోట్లకు చిల్లర సమస్య ఏర్పడింది. రూ.2000కు సరిపడ చిల్లర దొరకకపోవడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో చిన్న నోట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇటీవలే కొత్త రూ.20, రూ.50 నోట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించిన ఆర్బీఐ, ప్రస్తుతం రూ.100 నోట్లనూ కొత్తవి తీసుకురానున్నట్టు తెలిపింది. ఈ కొత్త రూ.100 నోట్లతో ప్రజలకు ఉపశమనం కల్గించాలని ఆర్ బీఐ నిర్ణయించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com