ల్యాండ్‌లైన్ ఫోన్లకు అంతర్జాతీయ కాలింగ్ రేట్ల తగ్గింపు!
- December 07, 2016
మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, ల్యాండ్‌లైన్ ఫోన్ల నుంచి అంతర్జాతీయ కాలింగ్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కువైట్ నుంచి 247 దేశాలకు పైగా ఈ తగ్గింపు వర్తించనుంది. 15 శాతం వరకు ప్రస్తుత ఛార్జీలు తగ్గే అవకాశం ఉంది. జనవరి 2 నుంచి ఈ తగ్గించిన రేట్లు అమల్లోకి రానున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండర్ సెక్రెటరీ ఇంజనీర్ హమెద్ అల్ కత్తాన్ ప్రెస్ స్టేట్మెంట్లో స్టేట్ మినిస్టర్ ఫర్ హౌసింగ్ ఎఫైర్స్ అండ్ యాక్టిఇంగ్ మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ యాసెర్ అబ్దుల్ ఇంటర్నేషనల్ కాలింగ్ ఛార్జీలపై నిర్ణయాన్ని ఆమోదించినట్లు పేర్కొన్నారు. అయితే అరబ్ మరియు జిసిసి దేశాల్ని ఈ నిర్ణయం నుంచి మినహాయించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







