క్రైమ్‌ ప్రిడిక్షన్‌ సిస్టమ్‌ని ప్రారంభించిన దుబాయ్‌ పోలీస్‌

- December 07, 2016 , by Maagulf
క్రైమ్‌ ప్రిడిక్షన్‌ సిస్టమ్‌ని ప్రారంభించిన దుబాయ్‌ పోలీస్‌

దుబాయ్‌: దుబాయ్‌ పోలీసులు 'క్రైమ్‌ ప్రిడిక్షన్‌ ఎనాలసిస్‌' అనే వినూత్నమైన సిస్టమ్‌ని ప్రారంభించనుంది. ఇది ప్రస్తుతం ట్రయల్‌ ఫేజ్‌లోనే ఉంది. సిటీ వ్యాప్తంగా పెరుగుతున్న క్రైమ్‌ రేట్‌ని తగ్గించేందుకు ఈ కొత్త సిస్టమ్‌ ఎంతగానో ఉపయోగపడనుంది. బిగ్‌ డేటా ద్వారా ఏదన్నా క్రైమ్‌ జరగవచ్చునని ముందే ఊహించి, దాన్ని అడ్డుకోవడం ఈ సిస్టమ్‌ ప్రత్యేకత. దుబాయ్‌ పోలీస్‌ ఆపరేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ కమల్‌ ముట్టి అల్‌ సువైది మాట్లాడుతూ, కొత్త సిస్టమ్‌ ద్వారా పోలీసులు, క్రైమ్‌ జరిగే అవకాశాలున్న ప్రాంతాల్ని, అలాగే క్రైమ్‌ హాట్‌ స్పాట్స్‌ని గుర్తించి, అక్కడ సిబ్బంది మోహరింపుని పెంచేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. రీజియన్‌లో తొలిసారిగా ఈ తరహా విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారాయన. దుబాయ్‌ పోలీస్‌ రికార్డ్స్‌ నుంచి మొత్తం డేటాని ఈ సిస్టమ్‌ వినియోగించుకుని, విశ్లేషిస్తుంది. దుబాయ్‌ పోలీసులు మీడియాకి ఈ విధానానికి సంబంధించి క్విక్‌ డెమోనిస్ట్రేషన్‌ కూడా ఇచ్చారు. ట్రాఫిక్‌ అలా క్రైమ్‌ ప్రిడిక్షన్స్‌ని ఈ సిస్టమ్‌ చేస్తుంది. సిటీలో క్రైమ్‌ రేట్‌ని తగ్గించే క్రమంలో ఈ సిస్టమ్‌ ఎంతగానో ఉపయోగపడ్తుందని, ఖచ్చితత్వంతో పోలీసులకు ఈ సిస్టమ్‌ సేవలు అందిస్తుందని విశ్వసిస్తున్నట్లు బ్రిగేడియర్‌ అల్‌ సువైది చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com