తప్పుదోవ పట్టించే వెబ్‌సైట్లపై డ్రాగన్‌ చైనా కొరడా...

- December 07, 2016 , by Maagulf
తప్పుదోవ పట్టించే వెబ్‌సైట్లపై డ్రాగన్‌ చైనా కొరడా...

 ప్రజలను తప్పుదోవ పట్టించే వెబ్‌సైట్లపై డ్రాగన్‌ చైనా కొరడా ఝుళిపించింది. అశ్లీల, అసభ్య సమాచారంతో లైవ్‌ స్ట్రీమింగ్‌ ప్రసారాలను చేస్తున్న సుమారు 4వేలకు పైగా వెబ్‌సైట్లను చైనా ప్రభుత్వం తొలగించింది. కొత్తగా వచ్చిన సైబర్‌స్పేస్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో వాటిని తొలగించినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. 'హింస, అశ్లీల, అసభ్య సమాచారం నిండిన లైవ్‌ స్ట్రీమింగ్‌ వెబ్‌సైట్లను చైనా మూసేసింది' అని జిన్‌హువా న్యూస్‌ ఏజెన్సీ తన కథనంలో పేర్కొంది.
చైనా ప్రభుత్వం నవంబర్‌లో సైబర్‌స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి నియమ, నిబంధలను తీసుకొచ్చింది.

వీటి ప్రకారం భద్రత, అస్థిర సమాజం, సామాజిక క్రమానికి విఘాతం కలిగించడం, పోర్నోగ్రఫీతో సహా వ్యర్థ సమాచారాన్ని ఏ వెబ్‌సైటూ అందించకూడదు. చైనా రాజధాని బీజింగ్‌ వేదికగా అసభ్య సమాచారాన్ని అంతర్జాలంలో ఉంచుతున్న సుమారు 4000 వెబ్‌సైట్లను ప్రభుత్వం తొలగించింది.
నిబంధనలను కఠినంగా అమలు చేసే క్రమంలో ఇంటర్నెట్‌ వ్యవస్థకు భద్రత కల్పించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు చైనా అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఆంక్షలు ఉన్నప్పటికీ సామాజిక మాధ్యమాల ద్వారా పలువురు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ప్రత్యామ్నాయ మాధ్యమాలు ప్రభుత్వానికి సవాల్‌ విసురుతున్నాయి. ముఖ్యంగా 4జీ, 5జీ సౌకర్యాలతో లైవ్‌ స్టీమింగ్‌ల ద్వారా కార్యక్రమాలను వీక్షించడం అక్కడ సర్వ సాధారణమైపోయింది. దీంతో చైనా నూతన నిబంధనలు తీసుకొచ్చింది. పోర్నోగ్రఫీ విస్తరించకుండా చేయడమే ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశం.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com