పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాణంలో నితిన్..
- December 07, 2016
అ..ఆ.. సినిమాతో 50 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించుకున్న యంగ్ హీరో నితిన్. ప్రస్తుతం ఈ లవర్ బాయ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథా కథనాలు అందిస్తున్నాడు. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. సినిమాలో త్రివిక్రమ్ మార్క్ స్పష్టంగా కనిపించేలా 'లై' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. ఇంగ్లీష్ లో LIE అనే రాసే ఈ టైటిల్ కు 'లవ్ ఈజ్ ఎండ్ లెస్' అనే ట్యాగ్ లైన్ ను జోడిస్తున్నారు.
నితిన్ ఇమేజ్ కు తగ్గట్టుగా ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో నితిన్ మరోసారి తన మార్కెట్ స్టామినాను ప్రూవ్ చేసుకుంటాడేమో చూడాలి.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







