పక్షి ప్రేమికుడిగా అక్షయ్‌

- December 07, 2016 , by Maagulf
పక్షి ప్రేమికుడిగా అక్షయ్‌

'రో బో'కి సీక్వెల్‌గా '2.0' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రజనీకాంత్‌ కథానాయకుడిగా తమిళంలో తెరకెక్కుతున్న ఆ చిత్రం తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో విడుదల కాబోతోంది. ఇటీవలే ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. కథానాయకుడు రజనీకాంత్‌తోపాటు, ప్రతినాయకుడిగా నటిస్తున్న అక్షయ్‌కుమార్‌ గెటప్పులు కూడా బయటికొచ్చాయి. అయితే అక్షయ్‌ గెటప్పే అందరినీ ఆసక్తికి గురిచేసింది. కాకిని పోలిన ఆ గెటప్పు వెనక రహస్యం ఏముంటుందబ్బా అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. శంకర్‌ సినిమాల్లో ఏ పాత్ర ఎలా ఉంటుందో ఎవ్వరం వూహించలేం.

అందుకే అక్షయ్‌కుమార్‌ గెటప్పు మరింతగా ఆసక్తికి గురిచేసింది. అయితే ఆ గెటప్పు వెనక గుట్టుని అక్షయ్‌కుమార్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. తాను పోషిస్తున్నది సైంటిస్ట్‌ పాత్రే అయినా, ఆ సైంటిస్టు పక్షి ప్రేమికుడిగా కనిపిస్తాడని చెప్పుకొచ్చాడు. అందుకే నా గెటప్పు కాకిలా కనిపించిందని స్పష్టం చేశాడు.

విశ్వసనీయ సమాచారం మేరకు శంకర్‌ వివిధ దేశాల నుంచి భిన్న జాతులకి చెందిన పక్షుల్ని తీసుకొచ్చి చిత్రీకరణ చేశాడట. పక్షులు, అక్షయ్‌కుమార్‌ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com