ఉగ్రవాదులు వేసే ప్రశ్నలకు రేడియో కేంద్రంలో సలహాలు

- December 07, 2016 , by Maagulf
ఉగ్రవాదులు వేసే ప్రశ్నలకు రేడియో కేంద్రంలో సలహాలు

 మీడియా విస్తరించడంతో జనానికి మంచి సేవలు అందుతున్నాయి. ప్రజలు మీడియాతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆరోగ్యం, చట్టాలు, అదృష్టం, జాతకాలు, వినోదం... ఇలా అనేక విషయాలపై సలహాలు అడుగుతున్నారు. నిపుణులు మీడియా ద్వారా ఇస్తున్న సలహాలను పాటించి జనం సత్ఫలితాలు పొందుతున్నారు. మీడియా నిర్వహించే ఫోన్ -ఇన్ కార్యక్రమాలు ప్రజలకు మేలు చేస్తున్నాయి. ఇప్పుడు ఇటువంటి సేవలను ఉగ్రవాదులు కూడా ఉపయోగించుకుంటున్నారు. మిడిల్ ఈస్ట్ మీడియా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కథనం ప్రకారం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో అల్-బయాన్ అనే రేడియో ప్రసారాలు జరుగుతున్నాయి. ఈ రేడియోలో ఫోన్-ఇన్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు.ఉగ్రవాదులకు ఏమైనా సందేహాలు ఉంటే ఫోన్ చేసి పరిష్కారాలను కోరవచ్చు. ఉగ్రవాదులు వేసే ప్రశ్నలకు రేడియో కేంద్రంలో ఉన్న మత పెద్దలు ఇస్లామిక్ చట్టాల ఆధారంగా సలహాలు ఇస్తూ ఉంటారు. ఉరితీతల వీడియోలను మహిళలకు చూపించవచ్చునా? మహిళలు చేయవలసిన పనులు ఏమిటి?సినిమాల్లో పురుషులను మహిళలు చూడటం వల్ల, పాతివ్రత్యం వల్ల సమస్యలు ఉన్నాయా? వంటి ప్రశ్నలు ఈ రేడియో కేంద్రానికి వస్తున్నాయి. ఇటువంటి ప్రశ్నలకు ఆ రేడియో కేంద్రంలోని మత పెద్దలు ఇస్తున్న సమాధానాలేమిటంటే... పరిచయం లేని పురుషులను మహిళలు చూడటాన్ని అనుమతించరాదు, నిషేధం విధించాలి.కొత్త పురుషులను మహిళలు కోరికతో, వ్యామోహంతో చూడకపోతే అనుమతించవచ్చు. ఇస్లామిక్ స్టేట్ వీడియోలను మహిళలు చూడవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com