మధ్యప్రాచ్యంలో ఐఎఇఎ భద్రతాచర్యలు పెంపొందించుకోవాలని కతర్ పిలుపు

- December 07, 2016 , by Maagulf
మధ్యప్రాచ్యంలో ఐఎఇఎ భద్రతాచర్యలు పెంపొందించుకోవాలని కతర్ పిలుపు

అంతర్జాతీయ చట్టబద్ధతతో కూడిన అణు భద్రతా ప్రమాణాలను మధ్యప్రాచ్యంలో ఐ ఎ ఇ ఎ విధానాలతో కూడిన తీర్మానాలను తక్షణ అమలు కోసం కృషి చేయాలని కతర్ పిలుపును ఇచ్చింది. ఈ చర్యతో మధ్యప్రాచ్యంలో అణుభద్రతతో కూడిన ప్రాంతం ఏర్పాటు కోసం ఒక ముఖ్యమైన దశకు చేరుకోవడం సాధ్యపడుతుందని ఎన్ పి టి  మరియు ప్రపంచవ్యాప్తంగా అణుభద్రతా విధానంలో సమగ్ర ప్రభావం పెరిగి  పటిష్టంగా మధ్యప్రాచ్యం ఉంటుంది. ఈ ప్రకటన ఇటీవల వియన్నాలో జరిగిన భద్రతపై అంతర్జాతీయ మంత్రివర్గ సమావేశంలో అంతర్జాతీయ అణు శక్తి సంస్థ  విదేశాంగ శాఖ కార్యదర్శి జనరల్ మరియు కతర్ గవర్నర్  డాక్టర్ అహ్మద్ హసన్ అల్ హమ్మది ద్వారా పైన పేర్కొన్న ప్రకటన వెలువడింది. ఆ సందర్భంగా డాక్టర్ అల్-హమ్మది ఆ సమావేశంలో మాట్లాడుతూ, కతర్ రాష్ట్రం సైతం ఇతర పశ్చిమాసియా దేశాల మాదిరిగానే శాంతియుత ప్రయోజనాల కోసం అణు కార్యకలాపాలు నిర్వహణలో అప్రమత్తమై ఉందని తెలిపారు. అంతర్జాతీయ శాంతియుత వాతావరణం భగ్నం చేసి యత్నాలను బెదిరించే పరిణామాలు గురించి యోచించి మధ్యప్రాచ్యంలో అణుభద్రతా ప్రమాణాలను విధించి చట్టబద్ధత తీర్మానాలు తక్షణ అమలు కోసం అంతర్జాతీయ సమాజం గమనించాలని పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com