నేషనల్ డే పెరేడ్: విజిటర్స్ కోసం బస్సులు
- December 12, 2016
డిసెంబర్ 18న దోహా కోర్నిచ్‌లో జరిగే నేషనల్ డే పెరేడ్‌లో పాల్గొనేందుకు వెళ్ళే సందర్శకుల కోసం బస్సుల్ని ఏర్పాటు చేస్తున్నారు. మస్జిద్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్, ఖలీఫా టెన్నిస్ అండ్ స్క్వాష్ కాంప్లెక్స్, అరుమీలియా రౌండెబౌట్, షెరటాన్ దోహా హోటల్ తదితర ప్రాంతాలనుంచి బస్సుల్ని నిర్వహించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - ట్రాఫిక్ అవేర్‌నెస్ అండ్ మీడియా డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ రాది అల్ హజిరి పేర్కొన్నారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా లెఫ్టినెంట్ కల్నల్ అల్ మజిరి విజ్ఞప్తి చేశారు. వాహనాలపైన నిల్చోవడం, మాస్క్‌లు ధరించడం, వాహనాల్లోంచి ఫోమ్‌ని స్ప్రే చేయడం, నంబర్ ప్లేట్స్ కన్పించకుండా జెండాల్ని ఎగరవేయడం వంటివి చేయరాదని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు సూచించారు. వేడుకల సందర్భంగా ఎవరైనా తప్పిపోయినట్లు అన్పిస్తే, 999 నంబర్‌ని సంప్రదించాల్సిందిగా నిర్వాహకులు తెలిపారు. కోర్నిచ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పెట్రోల్స్ నిరంతరం పర్యవేక్షిస్తుంటాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బాక్సింగ్‌లో ఏకంగా 7 స్వర్ణాలు సాధించిన భారత్!
- జలీబ్లో ఉక్కుపాదం.. 1,253 మంది అరెస్ట్..!!
- ఒమాన్‌లో ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన కీలక మార్పులు..!!
- అమెరికాలో సౌదీ రక్షణ శాఖ సహాయ మంత్రి..కీలక చర్చలు..!!
- ఘనంగా ప్రారంభమైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు..
- నిబంధనల ఉల్లంఘన.. ట్రావెల్ ఏజెన్సీ మూసివేత..!!
- యూఏఈలో ఈ ఏడాది తొలిసారి 50°C నమోదు..!!
- ఆరు రోజుల్లోనే 38 వేల మంది సందర్శకులు..విశేష ఆదరణ..!!
- వాట్సాప్ అంకుల్స్ పై ఇన్‌స్టా పిల్లలు గెలిచారు: కేటీఆర్
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..







