ప్యారడైజ్ బిర్యాని సెంటర్ మూసివేత..
- December 13, 2016
సికింద్రాబాద్‌లో ప్యారడైజ్ బిర్యాని ఎంత ప్రాముఖ్యత కలిగినదో పేదలకు 'చె' రూపాయ్ బిర్యాని అంత ప్రఖ్యాతి . చంద్రలోక్ కాంప్లెక్స్‌లో కేవలం ఆరు రూపాయలకే వెజిటబుల్ బిర్యానితోపాటు మూడు పూరీలు కానీ, మూడు మైసూర్ బజ్జీలు కానీ, ఒక బ్రెడ్ బజ్జీ కానీ ఇచ్చేవారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈ బిర్యానీ 6 రూపాయల నుండి 8, 10, 12, 16, 18 రూపాయలుగా పెరుగుతూ ప్రస్తుతం 23 రూపాయలకు చేరుకుంది. చంద్రలోక్ కాంప్లెక్స్ ప్రమాదం కారణంగా సోమవారం సాయంకాలం నుండి ఈ టిఫిన్ సెంటర్ మూసివేశారు. మంగళవారం ఈ చుట్టుపక్కల పనిచేసే చిరుద్యోగులు ఆకలితో ఇక్కడికి వచ్చి టిఫిన్ సెంటర్ మూసివేతను చూసి ఉసూరుమంటూ వెనుదిరిగారు.
ఇప్పుడు ఈ టిఫిన్ సెంటర్ భవిష్యత్తు జెఎన్టియు నిపుణుల నివేదికపై ఆధారపడి ఉంది.నిర్మాణాలపై ప్రత్యేక నజర్నిర్మాణంలో ఉన్న భవనాలు కూలుతోన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎట్టకేలకు అప్రమత్తమైంది. పనులు జరుగుతోన్న నిర్మాణాలను పరిశీలించి అనుమతులు ఉన్నాయా..? లేదా..? అన్నది పరిశీలించడంతోపాటు..
ప్లాన్ ఎలా ఉంది..? స్ట్రక్చరల్ డిజైన్ సక్రమంగా ఉందా..? దాని ప్రకారం పనులు జరుగుతున్నాయా..? అన్నది పరిశీలించాలని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







