ఈ నెల 18 నుంచి డీజే కొత్త షెడ్యూల్ ప్రారంభం
- December 15, 2016
స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం 'డీజే.. దువ్వాడ' జగన్నాథం. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. ఇప్పటికే హదరాబాద్ లో ఓ షెడ్యూల్ ని పూర్తి చేసుకొంది. అయితే, బన్నీకి కూతురు పుట్టడంతో షూటింగ్ సెలవు పెట్టాడు. ఈ గ్యాప్ లో బన్నీలేని సన్నివేశాలని చిత్రీకరిస్తూ వచ్చారు.బన్నీ మళ్లీ షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అయ్యాడు. ఈ నెల 18 నుంచి హైదరాబాద్ లో డీజే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూలో బన్నీ జాయిన్ కానున్నాడు. దాదాపు 15రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.ఈ చిత్రంలో బన్నీ ద్వీపాత్రాభినయం చేయనున్నాడు.ఓ పాత్రలో బ్రహ్మణ యువకుడిగా కనిపించబోతున్నాడు. ఈ పాత్ర ఓ రేంజ్ లో వినోదాన్ని పంచడం ఖాయమంటున్నారు. ఈ పాత్ర కోసం బన్నీ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకొన్నారు. హైదరాబాద్ లో జరిగిన మొదటి షెడ్యూల్ లో బ్రహ్మణ పాత్రకి సంబంధించిన కీలక సన్నివేశాలని చిత్రీకరించారు కూడా.ఈ చిత్రానికి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్. దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత బన్నీ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రంలో బన్నీ సరసన కీర్తి సురేష్ నటించనుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







