రాత్రి 10 గంటలకే బుర్జ్ ఖలీఫా,దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ మూసివేత

- December 16, 2016 , by Maagulf
రాత్రి 10 గంటలకే  బుర్జ్ ఖలీఫా,దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ మూసివేత

దుబాయ్: బుర్జ్ ఖలీఫా / దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ నూతన ఏడాది వేడుకకు రాత్రి 10 గంటల నుంచి  మూసివేయనున్నట్లు దుబాయ్ పోలీస్ రవాణా భద్రత విభాగం గురువారం ప్రకటించింది. దుబాయ్ పోలీస్ రవాణా భద్రత విభాగానికి డైరెక్టర్ కల్నల్ మహ్మద్ అహ్మద్ అల్ బస్తాకి ఈ సందర్భంగా మాట్లాడుతూ, నూతన సంవత్సర వేడుకులలో సమగ్ర భద్రత మరియు ట్రాఫిక్ ప్రణాళిక దుబాయ్ లో  నిర్వహించేందుకు ఈ చర్యలు తీసుకొంటున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా కొత్త ఏడాది ఎటువంటి అపశృతులు జరగకుండా ఉండేందుకుఆ పరిసర ప్రాంతాల్లో వాహనాలు, ప్రజా రవాణా,పాదచారులకు ఇబ్బందులు కలగకుండా నిర్వహణ సక్రమంగా కొనసాగించేందుకు దోహదపడుతుందని అన్నారు.రహదారులను మరియు రవాణా సంస్థ  మరియు పలు సంస్థల సమన్వయ ఫలితంగా ప్రణాళికలు అమలుపర్చనున్నట్లు అల్ బస్తాకి తెలిపారు. ఈ ప్రక్రియలో పోలీసు గస్తీ ముమ్మరంగా ఉండటమే కాక అదనపు పార్కింగ్ స్థలాలను సృష్టించడం, రోజంతా అటూ ఇటూ తిరిగే బస్సులను ఏర్పాటుచేయడం  కలిగి, మరియు కొన్ని  మెట్రో స్టేషన్ల మరికొన్నిరోడ్లు మూసివేయబడతాయి.డానుబే, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మరియు ఫైనాన్షియల్ సెంటర్ మెట్రో స్టేషన్లు నూతన ఏడాది వేడుకలో నిర్వహించబడతాయి.ఈ నూతన సంవత్సర వేడుకలు హాజరు అయ్యే  ప్రజలు బుర్జ్ ఖలీఫా / దుబాయ్ మాల్ స్టేషన్ బదులుగా వేరే ఇతర మార్గాలు ఉపయోగించాల్సి ఉంటుందని అన్నారు. ప్రజలు ట్రాఫిక్ లో ఇరుక్కోకుండా నివారించేందుకు ఉత్సవాల్లో ప్రజా రవాణా సక్రమంగా ఉపయోగించడానికి ఈ చర్యలు ఎంత గానో  ఉపయోగపడుతాయని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com