కోటిలింగాలను దర్శించుకున్న బాలకృష్ణ
- December 16, 2016
ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు జగిత్యాల జిల్లా కోటిలింగాలలో పర్యటిస్తున్నారు. ఉదయం కోటిలింగాల చేరుకున్న ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. నగరంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆయన కోటిలింగాల శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట దర్శకుడు క్రిష్ ఉన్నారు.
బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలను సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు శాతవాహనుల రాజధానిగా వర్థిల్లిన కోటిలింగాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









