జెనెటిక్ డిసీజెస్‌కి స్క్రీనింగ్ అతి ముఖ్యం
- December 17, 2016
జెనెటిక్ డిసీజెస్‌కి స్క్రీనింగ్ అతి ముఖ్యం
దుబాయ్: దుబాయ్ హెల్త్ అథారిటీ, న్యూ బోర్న్స్‌కి ఎర్లీ స్క్రీనింగ్ టెస్ట్‌లు చేయడం ద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారం వెతకవచ్చునని పేర్కొంది. 30కి పైగా జెనెటిక్ డిసీజెస్‌ని ముందుగానే పసిగట్టగలిగితే, వాటికి వైద్యం సులభతరమవుతుందనీ, అదే సమస్యను కనుగొనడం ఆలస్యమైతే చికిత్స కష్టమవుతుందని డిహెచ్‌ఎ చెప్పింది. లతీఫా హాస్పిటల్ పీడియాట్రిక్ డిపార్ట్‌మెంట్ హెడ్, కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ మొహమౌద్ అల్ హాలిక్ మాట్లాడుతూ, పుట్టిన తర్వాత 24 నుంచి 48 గంటల్లో స్క్రీనింగ్ టెస్ట్‌లు చేయడం ద్వారా మంచి ఫలితాలుంటాయని అన్నారు. తలసీమియా, సికెల్ సెల్ అనీమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్ ఇంకా ఇతర అనేక డిసీజెస్‌ని ముందుగానే కనుగొనగలిగితే వైద్యం చాలా తేలికవుతుందని డాక్టర్ అల్ హాలిక్ చెప్పారు. లతీఫా హాస్పిటల్‌లో జన్మించినవారిలో నూటికి నూరుమందరికీ ఈ పరీక్షలు చేస్తామని ఆయన తెలిపారు. దీని కోసం ఓ డ్రాప్ ఆఫ్ బ్లడ్ సరిపోతుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







