అనప కోఫ్తా
- December 18, 2016
కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము- ఒకటిన్నర కప్పు, శెనగపిండి- 5 టేబుల్ స్పూన్లు, బియ్యప్పిండి- 2 టేబుల్ స్పూన్లు, పసుపు- 1/2 టీ స్పూను, పచ్చిమిర్చి తరుగు- 1/2 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్- 3 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు- ఒకటిన్నర కప్పు, ఉప్పు- రుచికి సరిపడా, నూనె- డీప్ ఫ్రైకి సరిపడా, టమేటో ప్యూరీ- 1 టేబుల్ స్పూను, జీడిపప్పు పేస్ట్- 1 టేబుల్ స్పూను, కారం- 1/2 టీ స్పూను, ధనియాల పొడి- 1/2 టీ స్పూను, గరం మసాల- 1/2 టీ స్పూను, పెరుగు- 1/4 కప్పు, నీళ్ళు- 3/4 కప్పు.
తయారీ విధానం: సొరకాయ తురుమును గట్టిగా పిండి ఆ నీళ్ళను పక్కన ఉంచి తురుములో పావు టీ స్పూను పసుపు, శెనగపిండి, బియ్యప్పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు పావు కప్పు ఉల్లి ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి నిమ్మకాయంత ఉండలు చేసి నూనెలో దోరగా వేగించుకోవాలి. తరువాత కడాయిలో ఒక టేబుల్ స్పూను నూనె వేసి ఉల్లి ముక్కలను దోరగా వేగించాక అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను కూడా వేసి వేగించాలి. తరువాత టమేటో ప్యూరీ, జీడిపప్పు పేస్ట్ వేసి బాగా కలిపి నాలుగు నిమిషాలు ఉడికించాలి. తరువాత పసుపు, కారం, తగినంత ఉప్పు, ధనియాల పొడి, గరం మసాల వేసి రెండు నిమిషాలు ఉడికించాక పెరుగు, అర కప్పు నీళ్ళు, సొరకాయ తరుగు నుంచి తీసిన నీళ్ళు పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. తరువాత సొరకాయ ఉండలును కూడా వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









