మహిళల్లోనూ హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువే
- December 19, 2016
అబుదాబీ: ఇండియన్ సబ్ కాంటినెంట్‌కి సంబంధించినంతవరకు మహిళల్లోనూ హార్ట్ ఎటాక్ రిస్క్ పెరుగుతూ వస్తోందనీ, మరీ ముఖ్యంగా 40 ఏళ్ళలోపు మహిళల్లో ఈ రిస్క్ పెరుగుతుండడం ఆందోళనకరమని మెడియోర్ హాస్పిటల్ కన్సల్టెంట్ కార్డియో వాస్కులర్ డిసీజ్ డాక్టర్ దినేష్‌బాబు చెప్పారు. గతంలో మహిళలకు ఈ రిస్క్ తక్కువగా ఉండేదనీ, అయితే మహిళల్లో పెరుగుతున్న డయాబెటిస్, బ్లడ్ ప్రెజర్ వంటివి రిస్క్‌ని పెంచుతున్నాయని ఆయన చెప్పారు. అయితే నలుగురు పురుషులకు హార్ట్ ఎటాక్ ఉంటే ఒక మహిళకు హార్ట్ ఎటాక్ ఉంటోందని ఎన్‌ఎంసి హాస్సిటల్‌లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పాల్ ఎస్ థప్పిల్ చెప్పారు. ఈస్ట్రోజన్ కారణంగా హార్ట్ ఎటాక్ రిస్క్ కొంతవరకు తక్కువ ఉండేదని అయితే ఇప్పుడు మారుతున్న జీవన శైలి, జెనిటిక్ ఫ్యాక్టర్స్, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఇవన్నీ యంగర్ విమెన్‌ని కూడా హార్ట్ పేషెంట్లుగా మార్చేస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. 29 ఏళ్ళ భారతీయ వర్కింగ్ విమెన్ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత హార్ట్ ఎటాక్‌కి గురయ్యారనీ, తన కెరీర్‌లో అదే ఆ వయసులో ఉన్న మహిళకు వచ్చిన తొలి హార్ట్ ఎటాక్ కేసు అని డాక్టర్ థొప్పిల్ వివరించారు. ఆమె కుటుంబంలో ఆమె తండ్రి హార్ట్ ఎటాక్‌తో గతంలో చనిపోయారనీ, తద్వారా జెనిటిక్ పరంగా ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చి ఉంటుందన్నారాయన. రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనాన్ని అలవాటు చేసుకోవడమొక్కటే దీనికి నివారణ అని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- కువైట్ ఫ్రైడే మార్కెట్లో తనిఖీలు.. 61 మంది అరెస్ట్..!!
- మలేషియాలో వర్షంలోనూ అదరగొట్టిన గల్ఫ్ ఎయిర్ ఫ్లైపాస్ట్..!!
- ఖతార్‌లో పిల్లల డిజిటల్ భద్రతపై ప్రత్యేక దృష్టి..!!
- మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఆడపడచుల నీరాజనాలు
- కజకిస్థాన్‌కు బయలుదేరిన ఒమన్ సుల్తాన్..!!
- నాటక రంగానికి పూర్వవైభవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ స్కూళ్లలో ఫొటోలు, వీడియోలపై కొత్త నిబంధనలు..!!
- బిట్స్ పిలానీ–ఐఐటీ మద్రాస్ మధ్య ఐదేళ్ల భాగస్వామ్యం.. విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్







