58,0000 ఇండియన్స్‌కి ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్
- December 19, 2016
గడచిన రెండేళ్ళలో గల్ఫ్ దేశాల్లో ఎంప్లాయ్మెంట్ కోసం 58,000 మంది భారతీయ వర్కర్స్‌కి ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ లభించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి వికె సింగ్ సమాధానమిస్తూ ఈ వివరాల్ని వెల్లడించారు. సౌదీ అరేబియాలో ఎంప్లాయర్స్ నుంచి ఎదురవుతున్న సమస్యలపై ఇండియన్ వర్కర్స్ పలు ఫిర్యాదులు చేశారనీ, వాటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని ఆయన తెలిపారు. 2014 సెప్టెంబర్ నుంచి ఇప్పటిదాకా ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ లభించిన భారతీయ మైగ్రెంట్ డొమెస్టిక్ వర్కర్స్ సంఖ్య 58,163 అని ఆయన పేర్కొన్నారు. 207 దేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంఖ్య 31.73గా ఉందని, ఇందులో 13.45 మిలియన్ల మంది ఎన్ఆర్ఐలు కాగా, 17.85 మంది ఇండియన్ ఆరిజన్ కలవారని సమాధానంలో ప్రస్తావించారు కేంద్ర మంత్రి. ప్రభుత్వం 1,121 ఫిర్యాదుల్ని డిసెంబర్ 2012 నుంచి ఇప్పటిదాకా అందుకుందనీ, అందులో 973 ఫిర్యాదుల్ని రాష్ట్ర ప్రభుత్వాలకు రిఫర్ చేసినట్లు తెలిపారు. విడాకులు మంజూరయినట్లయితే పిల్లల పాస్‌పోర్ట్ విషయంలో తల్లిదండ్రులిద్దరి సంతకం కంపల్సరీ కాదనీ, ఎవరో ఒకరి అనుమతి ఉంటే సరిపోతుందని అన్నారాయన.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- కువైట్ ఫ్రైడే మార్కెట్లో తనిఖీలు.. 61 మంది అరెస్ట్..!!
- మలేషియాలో వర్షంలోనూ అదరగొట్టిన గల్ఫ్ ఎయిర్ ఫ్లైపాస్ట్..!!
- ఖతార్‌లో పిల్లల డిజిటల్ భద్రతపై ప్రత్యేక దృష్టి..!!
- మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఆడపడచుల నీరాజనాలు
- కజకిస్థాన్‌కు బయలుదేరిన ఒమన్ సుల్తాన్..!!
- నాటక రంగానికి పూర్వవైభవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ స్కూళ్లలో ఫొటోలు, వీడియోలపై కొత్త నిబంధనలు..!!
- బిట్స్ పిలానీ–ఐఐటీ మద్రాస్ మధ్య ఐదేళ్ల భాగస్వామ్యం.. విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్







