ఇండియాలో పెట్టుబడులకు ఇదే మంచి తరుణం..
- December 19, 2016
మనామా: ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్, పోర్టిఫోలియో మేనేజర్ పిఆర్ దిలీప్, బహ్రెయిన్ పర్యటనలో భాగంగా ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలపై జరిగిన సెమినార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో పెట్టుబడులకు ఇదే మంచి తరుణమని అన్నారు. గత 20 ఏళ్ళుగా భారతదేశం ఎలాంటి రెసిషన్ ఎఫెక్ట్‌ని ఎదుర్కొనలేదని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారతదేశం రికార్డులకెక్కిందని ఆయన చెప్పారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన పలు దేశాలు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నా ఆ ప్రభావం భారతదేశంపై పడలేదని ఆయన తెలిపారు. భారతదేశంలో సమర్థవంతమైన ఫైనాన్షియల్ మార్కెట్ ఉందని, ఈ సదవకాశాన్ని ఇన్వెస్టర్లు వినియోగించుకోవాలని కోరారాయన. దేశ ఆర్థిక సంస్కరణల్లో భాగంగా పెద్ద పాత నోట్ల రద్దు నిర్ణయం జరిగిందనీ, ఈ ప్రభావంతో భవిష్యత్తులో దేశ ఆర్థిక రంగం కొత్త పుంతలు తొక్కుతుందని బహ్రెయిన్ పర్యటనలో ఉన్న మరో ఆర్థిక నిపుణుడు దిలీప్ చెప్పారు. గ్రోత్ రేట్ పరంగా దేశం కొత్త రికార్డుల్ని సృష్టించబోతోందని వక్తలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- ఆ ఎండోమెంట్ల సమాచారం ఇస్తే SR10 మిలియన్ల వరకు రివార్డు..!!
- నిమిషాల్లోనే 6 చార్టర్ విమానాలు బుక్ చేసిన యూఏఈ అభిమానులు..!!
- కువైట్‌లో 8 నెలల్లో KD 10 బిలియన్ దాటిన POS చెల్లింపులు..!!
- జబల్ అల్ సవాదిలో సముద్ర జీవుల రక్షణకు స్పెషల్ డ్రైవ్..!!
- తాబేళ్లపై ఎక్కి వీడియోలు.. ఇద్దరు విదేశీయులకు ఒమన్‌లో జైలు శిక్ష..!!
- జీసీసీ దేశాల నుంచి రికార్డు స్థాయిలో కార్మికుల రెమిటెన్సులు..!!
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?







