అమరవీరులకు బహ్రెయిన్ శ్రద్ధాంజలి ..
- December 19, 2016
అమరవీరుల సేవల్ని బహ్రెయిన్ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా చెప్పారు. కమ్మెమరేసన్ డే సందర్భంగా కింగ్ హమాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం ప్రాణాలొదిల్ని ప్రతి ఒక్కరూ దేశ ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కింగ్ హమాద్ అన్నారు. అమరవీరుల కుటుంబాల్ని ఆదుకోవడంలో తమ ప్రభుత్వం ఎంతో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని ఆయన తెలియజేశారు. నవతరానికి అమరవీరులు మార్గదర్శకులుగా నిలుస్తారనీ, దేశ సేవ కన్నా గొప్ప విషయం ఇంకోటి లేదని నిరూపించిన అమరవీరులు దేశానికి ఆదర్శమని కింగ్ హమాద్ కొనియాడారు. వారి త్యాగాలకు వెలకట్టలేమని, వారిలా ప్రతి ఒక్కరూ దేశభక్తితో, బాధ్యతతో వ్యవహరించినప్పుడే అమరవీరులకు ఘన నివాళి పలికినట్లవుతుందని కింగ్ హమాద్ అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!
- కువైట్ విమానాశ్రయంలో డ్రగ్స్ రవాణా యత్నాలు భగ్నం..!!
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!







