సైఫ్ అలీఖాన్ - కరీనా దంపతులకు పండంటి బిడ్డ..
- December 20, 2016
బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్‌కు పండంటి మగబిడ్డ పుట్టాడు. సైఫ్ అలీఖాన్ - కరీనా దంపతుల మొదటి సంతానం మగపిల్లాడే. మంగళవారం తెల్లవారుజామున ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో కరీనా మగబిడ్డను కన్నట్లు ఆ కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయని ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ పేర్కొంది. ఉదయం 7.30 గంటలకు కొడుకు పుట్టాడని, తల్లీ బిడ్డలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపింది. కాగా, కరీనా కపూర్‌కు మంచి స్నేహితుడైన దర్శకుడు కరణ్ జోహార్ కూడా ఈ విషయాన్ని ట్వీట్ చేసి, ఆమె కొడుకు పేరును కూడా బయటకు ప్రకటించేశాడు. బుడ్డోడి పేరు తైమూర్ అలీఖాన్ అని చెప్పాడు. బెబోకు కొడుకు పుట్టినందుకు చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు.
కరీనా - సైఫ్ అలీఖాన్ 2012 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. సైఫ్ ఇంతకుముందు అమృతాసింగ్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆ దంపతులకు సారా అనే కూతురు, ఇబ్రహీం అనే కొడుకు ఉన్నారు. ఇప్పుడు సైఫ్ మళ్లీ కొడుకును కన్నాడన్న మాట.
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







