బెర్లిన్‌లో ట్రక్కు బీభత్సం, 12మంది మృతి
- December 20, 2016
జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్రిస్మస్ పండగ సందర్భంగా షాపింగ్ చేసుకుందామని మార్కెట్‌కి వచ్చిన వారిపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో 12మంది ప్రాణాలు ప్రాణాలు కోల్పోయారు.
మరో 50 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. బెర్లిన్‌లోని కైసెర్ విల్హెమ్ మెమోరియల్ చర్చికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రిస్మస్ పండుగ సమీపిస్తుండంతో మార్కెట్ అంతా పర్యాటకులు, స్థానికులతో రద్దీగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, ఈ ఘటనలో ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







