కాల్పుల కలకలం అమెరికా ఎంబసీ వద్ద!
- December 20, 2016
అంకారలోని అమెరికా రాయబార కార్యాలయం ముందు ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. టర్కీలో రష్యా రాయబారి హత్యకు గురైన కొన్ని గంటల్లోనే ఈ సంఘటన చోటుచేసుకోవడంతో అధికారులు షాక్ తిన్నారు. నల్లటి కోటు ధరించిన ఓ వ్యక్తి రాయబార కార్యాలయం ముందుకు వచ్చి ఎనిమిది రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. అనంతరం ఎంబసీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించాడు.
అయితే, అక్కడే ఉన్న గార్డులు చాలా ధైర్యంగా అతడిని నిలువరించి చేతిలోని గన్ లాక్కుని ఎలాంటి నష్టం లేకుండా చూశారు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలవలేదు. అంకారాలోనే రష్యా రాయబారిని పోలీసు దుస్తుల్లో వచ్చిన ఓ దుండగుడు వేదికపైనే కాల్చి చంపిన విషయం తెలిసిందే.
ఆ షాక్ నుంచి తేరుకోకముందే మరో రాయబార కార్యాలయం లక్ష్యంగా దాడికి యత్నం జరగడాన్ని అక్కడి అధికారులు సీరియస్ గా తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







