ఒమాన్ లోని భారతీయ విద్యార్ధులకు కోచింగ్ సెంటర్ల కొరత
- September 06, 2015
స్వదేశంలో ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ చేయాలనుకొనే ఒమాన్‌లోని భారతీయ విద్యార్ధులకు సరయిన తగిన కోచింగ్ సెంటర్లు లేకపోవడం ఒక పరీక్షగా తయారయింది. ఎంట్రన్స్ పరీక్షలకు హాజరవదానికి ప్రతి సంవత్సరం, ఇంచుమించు 10,000 మంది విద్యార్ధులు 12 వ తరగతి ఉత్తీర్ణులై, భారత రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షలలో పాల్గొనే అర్హత సంపాదిస్తున్నారు. కాగా, భారత దేశ వ్యాప్తంగా, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి అనుమతి పొందిన కళాశాలల్లో 50,000 మెడికల్ సీట్లు లభ్యమౌతుండగా, 14,73,871 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. ఇక IIT లలో 10,000; 25 NIT లలో 15,000; IIITలలో 1000 సీట్లు ఉన్నాయి. కానీ, మిలియన్ల మంది విద్యార్ధులు హాజరవుతున్నందున, పోటీ తీవ్రంగా ఉంటుందని, అతి శ్రేష్టులకే సీటు దక్కుతుందని, కాస్త మంచి రాoకులు పొందలేనివరరకి, ప్రైవేటు కాలేజీల్లో పెమెంటు సీట్లు తప్ప దిక్కులేదని, అది అందుబాటులో లేనిదని ఒమాన్ లోని భారతీయ స్కూల్ లో చదువుతున్న రాయ్ జొసెఫ్ అనే విద్యార్ధి వాపోయాడు. ఇక ఇలాంటి విద్యార్ధులు ఇండియాకు వెళ్ళి అక్కడి కోచింగ్ సెంటర్లలో చేరడమో లేక అంత ప్రభావవంతమైనది కాకపోయినా, ఆన్ ఆన్ లైన్ కోచింగ్ ద్వారా తయరుకావడమో మాత్రమే వారు చేయగలిగింది!
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







