షార్జా విల్లాలో ముగ్గురి మృతి: పోలీసుల విచారణ..

- December 22, 2016 , by Maagulf
షార్జా విల్లాలో ముగ్గురి మృతి: పోలీసుల విచారణ..

షార్జా: షారర్జాలోని అల్‌ కదిసియా ప్రాంతంలోగల విల్లాలో ముగ్గురు పాకిస్తానీ వ్యక్తులు మృతి చెందిన ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. మృతుల స్నేహితుడు, తమ స్నేహితుల్ని మృతిచెందిన పరిస్థితుల్లో కనుగొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగు చూసింది. మృతుల వయసు 24, 38, 45 ఏళ్ళుగా పోలీసులు గుర్తించారు. అధికారులు, ఫోరెన్సిక్‌ టీమ్‌ ఘటన జరిగగిన ప్రాంతానికి చేరుకున్నాయి. ప్రమాదకరమైన వాయువులే వారి ప్రాణాలు తీసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కి మృతదేహాల్ని తరలించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com