హోర్డింగులు కట్..
- December 22, 2016
నగరంలోని రోడ్లు, కూడళ్ళలో పెద్ద పెద్ద హోర్డింగులు, కటౌట్లతో నిండిపోయి వుంటుంది. ఇకపై ఇలాంటి వాటికి చెక్ పెట్టనుంది హైదరాబాద్ జీహెచ్ఎంసీ. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగులు ఏర్పాటు చేస్తే వారిపై కఠిన చర్యలు, జరిమానా విధిస్తామని కమిషనర్ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించగా తెలుగుదేశం పార్టీ, సీపీఎం పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు జీహెచ్ఎంసీ తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలపాలని కోరారు. ప్రజల్లో కూడా చైతన్యం తీసుకువచ్చేందుకు మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇప్పటికే అధికారులకు, స్థానిక నేతలకు అవగాహన కల్పించామని కమిషనర్ తెలిపారు.
తాజా వార్తలు
- యూఎన్లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!
- ఖతార్లో పూర్తి డిజిటలైజేషన్ దిశగా మారిటైమ్ రంగం..!!
- గాజా కోసం 1 కోటి భోజనాల కార్యక్రమానికి కొత్త పేరు..!!
- ఉద్యోగులపై డబ్బులు విసిరిన వైరల్ వీడియోలు.. ఒమన్ పోలీసుల చర్యలు..!!
- యూఎన్లో నెతన్యాహు స్పీచ్.. ఒక్కసారిగా ఖాళీ అయిన కుర్చీలు..
- రాస్ అల్ ఖైమాలో ప్రత్యేక వర్గాల కోసం ట్యాక్సీల సంఖ్య రెట్టింపు







