టర్కీకి వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన విజయనగరం వాసులు..

- December 22, 2016 , by Maagulf
టర్కీకి వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన విజయనగరం వాసులు..

ఉపాధి కోసం టర్కీకి వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన 11మంది తెలుగు వాళ్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని రంగరాయపురం, పెంట, చల్లారపువలస గ్రామాలకు చెందిన పలువురు ఉపాధి నిమిత్తం టర్కీకి వెళ్లారు. అక్కడ వారు పనిచేసిన పరిశ్రమ మూతపడటంతో ఉపాధి కోల్పోయారు. దీంతో తిరిగి తమ స్వగ్రామానికి చేరుకొనేందుకు వారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. టర్కీలో చిక్కుకున్న తమవారిని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చొరవచూపాలని బాధితుల కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com