'ఎంఎస్ ధోని' ఆస్కార్ జాబితాలో!
- December 22, 2016
భారత వన్డే జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'ఎంఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ' చలనచిత్రం ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు అర్హత చిత్రాల సుదీర్ఘ జాబితాలో చోటు దక్కించుకుంది. ఆ చిత్రంతోపాటు ఐశ్వర్యారాయ్ బచ్చన్ రణదీప్ హుడా ప్రధాన పాత్రల్లో నటించిన సరబ్‌జిత్ సినిమా కూడా ఆస్కార్ అర్హత దక్కించుకున్న 336 ఫీచర్ సినిమాల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఈ రెండూ జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలే కావడం గమనార్హం. ఆస్కార్ అర్హత సాధించిన జాబితాలోని ఫీచర్ సినిమాల వివరాలను బుధవారం 'ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్' విడుదల చేసిందని ఎంటర్‌టైన్ మెంట్ వీక్లీ పేర్కొంది.
2016 ఏడాదికిగానూ అకాడమీ అవార్డుల జాబితాలో ఉన్న ఈ సినిమాల్లో.. లాస్ ఏంజెలిస్‌లో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కనీసం వారంపాటు ప్రదర్శితమైన వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. 35 ఎంఎం లేదా 70 ఎంఎం సినిమా లేదా అర్హత కలిగిన డిజిటల్ ఫార్మాట్‌లో కనీసం 40 నిమిషాల నిడివికి మించ కుండా ఉండాలి. ఆస్కార్ అర్హ త జాబితాలో క్వీన్ ఆఫ్ కత్వే, లాలా లాండ్, మూన్ లైట్, మాంచెస్టర్ బై ది సీ, సైలెన్స్, అరైవల్, హాక్షా రిడ్జ్, డెడ్‌పూల్, సూసైడ్ స్క్వాడ్, కెప్టెన్అమెరికా, సివిల్ వార్, ఎక్స్‌మెన్ లాంటి చిత్రాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







