పునరావృతం

రోజూలాగే పుడుతున్న రోజు 

తూరుపు వదలని సూరీడు 

తూకానికో  
పైకానికో 
ఎంగిలైన వెలుగంతా  
వట్టి గన్నేరు పువ్వు 

మైలపడ్డ గతాన్ని కడిగేయలేక 
మానని గాయానికి మందివ్వలేక 

చెవిటితనమో 
అవిటితనమో 
చూడలేని గుడ్డితనమో 
గద్దెల్ని  ముస్తాబు చేస్తూ 
గద్దల్ని పిలుచుకొస్తూ
మళ్ళీ నేనూ నువ్వు 

వెలుతురు నిజాలు రాతిరికిచ్చి 
వేకువ చూపును చీకట్లో దాచి
మళ్ళీ మళ్ళీ నడుస్తున్నది .. అదే తొవ్వ !

పారువెల్ల

Back to Top