కేంద్ర ప్రభుత్వ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ..
- December 22, 2016
కేంద్ర ప్రభుత్వ నూతన సంవత్సర క్యాలెండర్‌ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గురువారం ఢిల్లీలో ఆవిష్కరించారు. 'నా దేశం మారుతోంది. మరింతగా పురోగమిస్తోంది' అనే థీమ్‌తో ఈ కొత్త క్యాలెండర్‌ను రూపొందించారు. ఈ క్యాలెండర్‌కు సంబంధించిన యాప్‌ను సైతం ప్రారంభించారు. క్యాలెండర్‌లో ఒక్కో పేజీని ఒక్కో థీమ్‌లో డిజైన్ చేశారు. సెప్టెంబర్ నెల పేజీని 'నగదురహిత లావాదేవీలు' థీమ్‌తో రూపొందించారు. డిసెంబర్ 25న 'గుడ్ గవర్నెన్స్ డే'ను పురస్కరించుకుని ఆ రోజున 100 రోజుల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుడతామని వెంకయ్య ప్రకటించారు. ఆ రోజు కేంద్రమంత్రులు, ఎంపీలు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో సందర్శించి కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







