కార్తి మళ్లీ పోలీసుగా!
- December 23, 2016
'పరుత్తివీరన్'లో గ్రామీణ యువకుడిగా నటించి కోలీవుడ్లోకి అడుగుపెట్టారు కార్తి. ఆ తర్వాత స్టైలిష్ కుర్రాడిగా కనిపించే సినిమాలను ఎంచుకున్నారు. అనంతరం తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'విక్రమార్కుడు'పై మనసు పారేసుకుని.. ఆ చిత్ర రీమేక్‌లో నటించారు. 'సిరుతై'గా వచ్చిన ఈ సినిమా కార్తికి మంచి ఇమేజీని తెచ్చిపెట్టింది. ద్విపాత్రాభినయం పోషించడంతోపాటు.. పోలీసుగా పవర్ఫుల్ ఎమోషన్‌ను వ్యక్తపరిచి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. ఇప్పుడు మళ్లీ పోలీసుగా ఆయన కనిపించబోతున్నారు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలోని 'కాట్రు వెలియిడై'లో కార్తి నటిస్తున్నారు.
ఇది పూర్తికాగానే 'చదురంగవేట్టై' ఫేం వినోద్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. ఆ చిత్రంలోనే కార్తి పోలీసు అధికారిగా నటించనున్నారు. ఈ సినిమాకు 'తీరన్ అధికారం ఒండ్రు' అని పేరు పెట్టారు. కార్తి సరసన రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయికగా సందడి చేయనుంది.
దర్శకత్వంతోపాటు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే కూడా సమకూర్చుతున్నారు వినోద్. సినిమాటోగ్రాఫర్‌గా సత్య వ్యవహరిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ జనవరి తొలివారం నుంచి ఆరంభం కానుంది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







