ప్రిన్స్ సెట్స్‌లోకి గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్‌భాయి పటేల్..

- December 23, 2016 , by Maagulf
ప్రిన్స్ సెట్స్‌లోకి గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్‌భాయి పటేల్..

మహేష్‌బాబు- మురుగదాస్‌ల ప్రాజెక్టు ప్రస్తుతం గుజరాత్‌లో షూటింగ్ జరుగుతోంది. అహ్మదాబాద్‌లోని జైడస్ ఆసుపత్రిలో చిత్రానికి సంబంధించి కొన్ని సీన్లను షూట్ చేస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్‌భాయి పటేల్ సెట్‌కి వచ్చారు. కుటుంబసమేతంగా లొకేషన్‌లోకి వచ్చిన నితిన్‌భాయ్ పటేల్, హీరో మహేష్‌బాబు, డైరెక్టర్ మురుగదాస్‌తో కలిసి ఫొటో దిగారు. ఈ విషయాన్ని నితిన్‌భాయ్ పటేల్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.ఇప్పటివరకు ప్రిన్స్ సెట్స్‌లోకి ఇలా రాజకీయ నేతలు ఎప్పుడు రాలేదని ఫస్ట్ టైం చూస్తున్నామని అంటున్నారు యూనిట్ సభ్యులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com