పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అగ్ని పర్వతంలాంటి వాడు..
- December 23, 2016
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అగ్ని పర్వతంలాంటి వాడని, అప్పుడప్పుడు గుడగుడలాడే లావాలా పొగ వదులుతుంటాడని అన్నాడు సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ. సమయం వచ్చినప్పుడు భారీ విస్ఫోటనంలా పవన్ పేలతాడని వ్యాఖ్యానించాడు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను పవన్ చురుగ్గా గమనిస్తున్నాడు.. వచ్చే ఎన్నికల్లో సంచలనం సృష్టిస్తాడు.. ఆ దమ్ము అతనికి ఉంది అని వర్మ పేర్కొన్నాడు.
జయలలిత స్నేహితురాలు శశికళ జీవితంపై వచ్చే ఏడాది సినిమా తీస్తానని వర్మ తెలిపాడు. కొన్నేళ్లుగా జయ వెనక ఉండి రాజకీయాల్లో పరోక్షంగా కీలక పాత్ర పోషించిన శశికళలో ఏదో విషయం ఉందనేగా అన్నాడు. మెగాస్టార్ చిరంజీవికి తానో పెద్ద అభిమానినని, ఆయన 150 వ చిత్రం ఖైదీ నెం.150 బాహుబలిని మించిన చిత్రం అవుతుందని ఆశించానని, కానీ ఆయన ఓ రీ-మేక్ సినిమాతో అభిమానుల ముందుకొస్తాడని ఊహించలేదని వర్మ కామెంట్ చేశాడు.
తాజా వార్తలు
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన
- దుబాయ్లో పెయిడ్ కార్ లిఫ్ట్లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్ఫోర్స్ సమీక్ష..!!







