విప్రోకు ఓ గండం గట్టెక్కింది!
- December 23, 2016
దేశీయ ఐటీ దిగ్గజం విప్రో ఓ గండం నుంచి గట్టెక్కింది. నిధుల దుర్వినియోగ ఆరోపణలపై గత ఆరేళ్లుగా సాగుతున్న విచారణ నుంచి బయటపడింది. ఓ ఉద్యోగికి సంబంధించిన 4 మిలియన్ డాలర్ల(రూ.27 కోట్లకు పైగా) నిధులను విప్రో కంపెనీ దుర్వినియోగానికి పాల్పడిందని అమెరికా సెక్యురిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్(ఎస్ఈసీ) విచారణ జరుపుతోంది. ఈ కేసులో అమెరికా ఏజెన్సీతో విప్రో సెటిల్ మెంట్ కుదుర్చుకుంది. ఈ సెటిల్ మెంట్ కింద కంపెనీ 5 మిలియన్ డాలర్ల(రూ.33 కోట్లకు పైగా) జరిమానా చెల్లించాల్సి ఉంది. అమెరికా ఏజెన్సీతో సెటిల్ మెంట్ కుదుర్చుకున్న విషయాన్ని విప్రో దిగ్గజం నేడు బొంబాయ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో తెలిపింది. అయితే ఈ సెటిల్ మెంట్ లో కంపెనీ సెక్యురిటీస్ ఎక్స్చేంజ్ యాక్ట్ 1934 నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలను విప్రో ఖండించలేదు.
విప్రో ఓ ఉద్యోగికి సంబంధించిన 4 మిలియన్ డాలర్ల నిధులో దుర్వినియోగానికి పాల్పడినట్టు వెల్లడైంది. దీన్ని 2009లో కంపెనీ గుర్తించింది. 2010 సెప్టెంబర్ లో అమెరికా ఏజెన్సీ దీనిపై దర్యాప్తు ప్రారంభించింది. నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్టు గుర్తించిన వెంటనే కంపెనీ సైతం అంతర్గతంగా, బహిరంగంగా ఎన్నో విచారణలను చేపట్టింది. అదనంగా అకౌంటింగ్, ఫైనాన్స్ కు సంబంధించిన అధికారులను నియమించుకోవడం చేసింది. ఎంతో కాలంగా సాగుతున్న ఈ విచారణ ఓ కొలిక్కి రావాలని స్టాక్ హోల్డర్స్ అందరూ భావించారని, ఈ మేరకు ఏజెన్సీలతో పరిష్కారం కుదుర్చుకున్నామని విప్రో తెలిపింది.
తాజా వార్తలు
- భారత్–షార్జా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!
- సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన







