డ్రగ్స్ స్మగ్లింగ్: వ్యక్తికి జీవిత ఖైదు
- December 23, 2016
మనామా: సుప్రీం అపీల్స్ కోర్ట్, పాకిస్తానీ వ్యక్తికి జీవిత ఖైదు విధించింది. తన కాలి స్లిప్పర్స్‌లో రెండు కిలోల హెరాయిన్‌ని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు నిందితుడు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో మే నెలలో నిందితుడు చిక్కాడు. నిందితుడు పాకిస్తాన్‌లోని కరాచీ నుంచి వచ్చాడు. సాధారణ స్లిప్పర్స్ కంటే కాస్త ఎక్కువగా ఉన్నట్లు గుర్తించి, అతన్ని విచారించగా హెరాయిన్ బయటపడిందని కస్టమ్స్ అధికారి చెప్పారు. స్లిప్పర్స్తోపాటు అతను తీసుకొచ్చిన బ్యాగ్‌లోనూ హెరాయిన్‌ని గుర్తించారు కస్టమ్స్ అధికారులు. వీటి మొత్తం బరువు 2 కిలోగ్రాములు. హాషిష్ అనే డ్రగ్‌ని అతను తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. 5000 బహ్రెయినీ దినార్స్ జరీమానా కూడా విధించింది న్యాయస్థానం. జైలు శిక్ష ముగిసిన తర్వాత అతన్ని డిపోర్ట్ చేస్తారు.
తాజా వార్తలు
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!
- ఖతార్‌లో ఇంటర్నేషనల్ స్పేస్ వీక్ 2026..!!
- బహ్రెయిన్‌లో అక్టోబర్ 9న ‘ట్రిబ్యూట్ టు బహ్రెయిన్’..!!
- కువైట్‌లో 77 సంస్థలకు ఫైర్ సేఫ్టీ హెచ్చరికలు..!!
- దుబాయ్ డ్యూటీ ఫ్రీలో $1 మిలియన్ గెలిచిన భారతీయుడు..!!
- GCC-ASEAN మధ్య ఆర్థిక, వాణిజ్య సహకార విస్తరణపై చర్చలు..!!
- భారీ వర్షాలు..అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు!
- హైదరాబాద్ విమానాశ్రయం–బ్రస్సెల్స్ విమానాశ్రయం మధ్య అవగాహన ఒప్పందం
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో వైట్ కోట్ సెరిమనీ
- ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. పలు విమానాల దారి మళ్లింపు







