మాషా, బియర్లను ఖతార్‌కి తీసుకొచ్చిన లులు..
- December 24, 2016
ప్రపంచ ఫ్రఖ్యాత యానిమేటెడ్ కార్టూన్ క్యారెక్టర్స్ మాషా మరియు బియర్లను లులు హైపర్ మార్కెట్స్ గ్రూపు ఖతార్‌కి తీసుకొచ్చింది. మీట్ అండ్ గ్రీట్ పేరుతో బుధవారం లులు హైపర్ మార్కెట్ - బర్వా సిటీలో ఆల్రెడీ ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రోజు డి-రింగ్‌రోడ్ లులు హైపర్ మార్కెట్లో మాషా మరియు బియర్తో చిన్నారుల పరిచయ ఈవెంట్ జరుగుతుంది. సాయంత్రం 6.30 నుంచి 9.30 గంటల వరకు ఈ ఈవెంట్ ఉంటుంది. ఖతార్‌కి మాషా, బియర్లను తీసుకొచ్చేందుకు సదరు సంస్థను ఒప్పించడంలో లులు సంస్థ విజయవంతమయ్యింది. మాషా, బియర్లతో ఫొటోలు దిగేందుకు ఎలాంటి రుసుమూ వసూలు చేయరు. రానున్న రోజుల్లో బియర్, మాషాలతో లులు సెంటర్స్ వద్ద చిన్నారులు ఎంజాయ్ చేయొచ్చని, నిర్ణీత సమయాల్లో ఈ క్యారెక్టర్స్ చిన్నారుల్ని అలరిస్తాయని లులు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







