క్రైమ్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్‌ని ఆవిష్కరించిన దుబాయ్ పోలీస్
- December 24, 2016
స్పేస్ ఇమేజింగ్ మిడిల్ ఈస్ట్ (ఎస్ఐఎంఇ) క్రైమ్ ప్రిడిక్షన్ అనే సాఫ్ట్‌వేర్‌ని ప్రారంభించింది. నేరాలను ముందుగానే ఊహించి, తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నేరాల్ని తగ్గించడానికి ఈ సాఫ్ట్వేర్ ఉపయోగపడ్తుంది. దుబాయ్ పోలీసుల అమ్ముల పొదిలో ఓ అస్త్రంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఈ రీజియన్‌లో ఈ తరహా సాఫ్ట్వేర్ ఇప్పటిదాకా ఎవరూ వినియోగించలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. దుబాయ్ పోలీస్ ఎప్పటికప్పుడు అధునాతన టెక్నాలజీని వినియోగించి, ముందడుగు వేస్తోందనీ, నేరాల్ని తగ్గించడంలో దుబాయ్ పోలీసుల కమిట్మెంట్ చాలా గొప్పదని పోలీస్ ఉన్నతాధికారులు చెప్పారు. ఎస్ఐఎంఇ - జిఐఎస్ డివిజన్ హెడ్ స్పందన్ కౌర్ మాట్లాడుతూ, ఈ సాఫ్ట్వేర్ చాలా ఇంటెల్లిజెంట్గా వ్యవహరిస్తుందని, అత్యంత ఖచ్చితత్వంతో దుబాయ్ పోలీసులకు సేవలు అందిస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







