పిట్టగోడ :రివ్యూ
- December 24, 2016 
నటీనటులు: విశ్వదేవ్ రాచకొండ, పునర్నవి భూపాలం, ఉయ్యాల జంపాల రాజు, జబర్దస్త్ రాజు, శివ, ఆర్.ఎస్, శ్రీకాంత్ తదితరులు
సంగీతం: 'ప్రాణం' కమలాకర్
ఛాయాగ్రహణం: దినేష్ కుమార్
నిర్మాతలు: దినేష్ కుమార్, రామ్మోహన్ పి.సమర్పణ: డి. సురేష్ బాబు
దర్శకత్వం: అనుదీప్ కె.వి
విడుదల తేదీ: 24-12-2016
ఈ రోజుల్లో సినిమా చూసే వాళ్లలో అత్యధికులు యువతీయువకులే. వాళ్ల ఆలోచనలూ, అభిరుచులకు సినిమా కథ దగ్గరగా ఉంటే... వాళ్లుసులువుగా కనెక్ట్ అవుతారు. థియేటర్లూ నిండిపోవడం ఖాయం. అందుకే ఈ తరహా కథలకు డిమాండ్. 'నలుగురు స్నేహితులూ, వాళ్ల జీవితాలూ' అంటూ మొదలెడితే ఎన్ని కథల్ని ఆవిష్కరించొచ్చో!! 'హ్యాపీడేస్'లా అన్నమాట. 'పిట్టగోడ' కూడా ఆ తరహా కథే. నలుగురు స్నేహితుల ప్రయాణం ఈ సినిమా. మరి దీన్ని తీర్చిదిద్దిన విధానం ఎలా ఉంది... 'పిట్టగోడ' టార్గెట్ ఆడియన్స్‌కి ఏమాత్రం నచ్చుతుంది.. వంటివి తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే!
* కథేంటంటే...
టిప్పు, బిల్డప్ వేణు, జ్ఞానేశ్వర్, నాగరాజు... గోదావరి ఖనిలో పనీ పాటా లేకుండా తిరిగే బ్యాచ్. ఆ వూళ్లొ ఎవరికీ వీళ్లంటే గౌరవం ఉండదు. ఇంట్లో కూడా తిట్లూ చీవాట్లే! వీళ్లేమే 'పిట్టగోడ' ఎక్కి కబుర్లు చెప్పుకొంటుంటారు. వీళ్లకు ఆ గోడే ప్రపంచం. తమలోకంలో తాము బతుకుతుంటారు. కానీ ఓ రోజు వాళ్లలోనూ మార్పు వస్తుంది. తమని తాము నిరూపించుకోవాలనీ, వూళ్లొ అందరి ముందూ కాలరెత్తుకొని తిరగాలనీ అనుకొంటారు. టిప్పు... దివ్య అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ కథే... అందరి జీవితాల్నీ ఓ కొత్త దారిలోకి మళ్లిస్తుంది. అదేంటన్నది తెరపై చూడాలి.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







