'కేశవ' ఫస్ట్‌లుక్!
- December 24, 2016
'ఎక్కడికి పోతావు చిన్నవాడా' తర్వాత నిఖిల్ కథానాయకుడిగా సుధీర్ వర్మ దర్శకత్వంలో 'కేశవ' అనే చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. నిఖిల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. ''ఎక్కడి పోతావు చిన్నవాడా' తర్వాత నా చిత్రం ఇది.. నా ఫస్ట్‌లుక్‌తో 'కేశవ' తొలి పోస్టర్. 50 శాతం షూటింగ్ పూర్తయింది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా' అని నిఖిల్ ట్వీట్ చేశారు. పోస్టర్లో నిఖిల్ చాలా కోపంగా కనిపించారు. ఒక వైపు గుడి గోపురం, మరోవైపు జీపు..రక్తంలో పడి ఉన్న తుపాకీని ఇలా ఆసక్తికరంగా పోస్టర్‌ను చూపించారు.
నిఖిల్ 14వ చిత్రంగా తెరకెక్కుతోన్న 'కేశవ'లో 'పెళ్లి చూపులు' చిత్రంలో నటించిన రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







