తెలంగాణ- మహారాష్ట్ర రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టుల బీభత్సం

- December 24, 2016 , by Maagulf
తెలంగాణ- మహారాష్ట్ర రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టుల బీభత్సం

రాష్ట్ర సరిహద్దులోని మహారాష్ట్రలోగల గడ్చిరోలి జిల్లా సూరజ్‌గడ్‌ అటవీ ప్రాంతంలో నిషిద్ధ మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. అటవీ ప్రాంతంలోని ఐరన్ ఓర్‌ తవ్వకాల వద్ద ఉన్న 47 లారీలు, టిప్పర్లు, నాలుగు జేసీబీలు, రెండు రోడ్డు రోలర్లతో పాటు ఇతర వాహనాలకు నిప్పంటించారు. దీంతో సరిహద్దులో యుద్ద వాతావరణం నెలకొంది. రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసులు అడవుల్లో పెద్దఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. సరిహద్దులోని మహదేవ్‌పూర్, మంథని డివిజన్‌లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com