రష్యాలో 91 మందితో వెళ్తున్న రక్షణ శాఖ విమానం అదృశ్యం!
- December 24, 2016
రష్యాలో రక్షణ శాఖకు చెందిన విమానం ఒకటి గల్లంతైంది. విమానం సోచి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయని అధికారులు వెల్లడించారు. టీయూ-154 విమానం సోచి నుంచి సిరియా సముద్రతీర నగరం లటాకాకు బయలు దేరింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5:20 గంటలకు సోచిలో టేకాఫ్ అయిన విమానం.. 5:40 గంటలకు రాడార్ నుంచి తప్పిపోయినట్లు ఎమర్జెన్సీ మినిస్ట్రీ అధికారులు వెల్లడించారు. విమానంలో జర్నలిస్టులు, సైనికాధికారులు, మ్యుజీషియన్స్ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం విమానంలో 83 మంది ప్రయాణికులతో పాటు 8 మంది సిబ్బంది ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!
- కువైట్‌లో వీధి కుక్కలు..ఇంటిరీయర్ మినిస్ట్రీ కీలక సూచనలు..!!
- ఖతార్‌లో విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్..!!
- దుబాయ్‌లో ఉద్యోగం మారుతున్నారా.. నాన్ కంపీట్ క్లాజ్ తెలుసా?
- బౌషర్‌లో ఇంటి నుంచి ఏసీ యూనిట్ల చోరీ..!!
- సౌదీలో భారీ వర్షాలు..తూర్పు ప్రావిన్స్‌లో రెడ్ ఫాగ్ అలర్ట్..!!
- తెలంగాణ టూరిజానికి డిజిటల్ బూస్ట్..
- ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్..







