తిరుపతి వేదికగా రేపే గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో విడుదల
- December 24, 2016
ప్రముఖ నటుడు, నందమూరి బాలకృష్ణ నటించిన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిని సంక్రాంతికి విడుదల చేస్తామని ఆ చిత్ర సమర్పకుడు బిబో శ్రీనివాస్, నిర్మాత రాజీవ్‌రెడ్డి వెల్లడిం చారు. చిత్తూరు జిల్లా తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ పాఠశాల మైదానంలో సోమవారం సాయంత్రం ఈ చిత్ర ఆడియో వేడుకను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా శనివారం తిరుపతి ఎమ్మెల్యే సుగుణతో కలిసి మైదానాన్ని పరిశీలించి, ఏర్పాట్లపై చర్చించారు. ఆడియో వేడుకకు ఎంతమంది వస్తారు? ఎంట్రీలెలా? వీఐపీ బ్యారికేడ్లు, స్టేజ్ నిర్మాణం వంటివాటిపై ఆడియో వేడుక నిర్వహిస్తున్న జై మీడియా ఈవెంట్ ప్రతినిధి నరేంద్రరాజుతో సమీక్షించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా 800 థియేటర్లలో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా సినిమా ఉంటుందన్నారు. ఆడియో వేడుకకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సీనియర్‌నటి హేమమాలినితో పాటు చిత్ర పరిశ్రమలోని నటీనటులు పెద్దఎత్తున హాజరవుతారన్నారు.
అందరూ ఆహ్వానితులేనని.. వీవీఐపీలకు మాత్రమే ఎంట్రీ పాసులు ఇస్తున్నామన్నారు. ఆదివారం సాయంత్రానికి ఏర్పాట్లు పూర్తవుతాయన్నారు. సోమవారం సాయంత్రం తిరుపతిలోని ఓ హోటల్ వద్ద నుంచి 500 కార్లు, 1000 ద్విచక్ర వాహనాలతో బాలకృష్ణ భారీ ర్యాలీగా ఆడియో వేదిక వద్దకు చేరుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు శ్రీధర్‌వర్మ, రవినాయుడు, నరసింహయాదవ్, బాల కృష్ణ ఫ్యాన్స్ సతీష్, మనోహర్‌రెడ్డి, సురేంద్ర, కోరా పృథ్వీచౌదరి, జగన్, రవితేజ, తిలక్, షఫీ, భాస్కర్‌రాజు, హేమంత్‌రాయల్, చిత్ర బృందం, పోలీసులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!
- కువైట్‌లో వీధి కుక్కలు..ఇంటిరీయర్ మినిస్ట్రీ కీలక సూచనలు..!!
- ఖతార్‌లో విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్..!!
- దుబాయ్‌లో ఉద్యోగం మారుతున్నారా.. నాన్ కంపీట్ క్లాజ్ తెలుసా?
- బౌషర్‌లో ఇంటి నుంచి ఏసీ యూనిట్ల చోరీ..!!
- సౌదీలో భారీ వర్షాలు..తూర్పు ప్రావిన్స్‌లో రెడ్ ఫాగ్ అలర్ట్..!!







