'మన్‌ కీ బాత్‌' లో అవినీతిపై సందేశమిచ్చిన మోదీ.!

- December 25, 2016 , by Maagulf
'మన్‌ కీ బాత్‌' లో అవినీతిపై సందేశమిచ్చిన మోదీ.!

పెద్దనోట్ల రద్దుతో అవినీతిపై యుద్ధం ప్రారంభించామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అవినీతిని అంతమొందించాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 'మన్‌ కీ బాత్‌' కార్యక్రమం ద్వారా సందేశమిచ్చిన ప్రధాని.. ముందుగా దేశ ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'అవినీతి, నల్లధనంపై మా ప్రభుత్వం యుద్ధం ప్రారంభించింది. పెద్దనోట్ల రద్దును దేశ ప్రజలు స్వాగతించారు. ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ అనేక మంది లేఖలు రాశారు.

దేశంలో డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహంచే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే నేటి నుంచి ' లక్కీ గ్రాహక్‌ యోజన' ప్రారంభిస్తున్నాం. వ్యాపారుల కోసం డిజి- ధన యోజన్‌కు శ్రీకారం చుడుతున్నాం. దేశంలో కొద్దిరోజుల నుంచి 200-300 శాతం నగదు రహిత లావాదేవీలు పెరిగాయి. దేశవ్యాప్తంగా 30 కోట్ల రూపే కార్డులు ఉండగా.. జన్‌ధన్‌ ఖాతాలు ఉన్నవారి వద్దే 20 కోట్ల రూపే కార్డులున్నాయి. డిజిటల్‌ మార్పు యువత సహా అంకుర సంస్థలకు సువర్ణావకాశం లాంటిది' అని ప్రధాని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com