ఆయిల్ అండ్ గ్యాస్ ఎమర్జన్సీ నెంబర్‌ని ప్రారంభించిన తత్వీర్
- December 26, 2016
తత్వీర్ పెట్రోలియం, హాట్ లైన్ నెంబర్ 88 88 3 అనే నెంబర్‌ని ప్రారంభించింది. ఆయిల్ మరియు గ్యాస్ ఎమర్జన్సీస్‌లో ఈ నెంబర్‌ని వినియోగించుకోవాలని తత్వీర్ వెల్లడించింది. భద్రతే తమకు మొదటి ప్రయారిటీ అని ఈ సందర్భంగా తత్వీర్ పెట్రోలియం సిఇఓ టామీ మెకెంజీ చెప్పారు. ఆయిల్ అండ్ గ్యాస్ ఎమర్జన్సీ సమయంలో ఎవరైనా పేర్కొనబడిన నెంబర్‌కి ఫిర్యాదు చేస్తే, సకాలంలో సిబ్బంది అక్కడి చేరుకుని, అవసరమైన సహాయ సహకారాల్ని అందిస్తారు. బహ్రెయిన్ ఆయిల్ ఫీల్డ్‌లో వాహనాల్ని నడిపేవారు, అక్కడ సూచించబడిన హెచ్చరిక బోర్డుల్ని తప్పక పరిశీలించి, తదనుగుణంగా ముందుకు వెళ్ళాలని టామీ మెకంజీ చెప్పారు. హై ప్రెజర్‌తో ఉండే ఆయిల్ మరియు గ్యాస్ పైప్‌లైన్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ, అలాగే ఓవర్ హెడ్ పవర్ లైన్స్ ఉండే చోట్ల ఖచ్చితమైన నిబంధనల్ని అమలు చేయాల్సి ఉందని తత్వీర్ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







