లాప్ టాప్ లో మాదక ద్రవ్య మాత్రలను తరలిస్తున్న అక్రమ రవాణాదారుని పట్టివేత..

- December 27, 2016 , by Maagulf
లాప్ టాప్ లో మాదక ద్రవ్య మాత్రలను తరలిస్తున్న అక్రమ రవాణాదారుని  పట్టివేత..

' మేడి పండు చూడ మేలిమై ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు ' అదే స్థాయిలో సమాచారం ఇచ్చే లాప్ టాప్ మత్తుకల్గించే డ్రగ్గులకు నిలయమైంది...అనుమానం కల్గిన అధికారులు ఆ ఎలక్ట్రానిక్ పరికరాన్ని మరలు విప్పి చూస్ 267,6 గ్రాముల బరువు కల్గిన 2727 మాదక ద్రవ్య మాత్రలను కనుగొని ఆశ్చర్యపోయారు. సోమవారం  బహరేన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు వాటిని అక్రమంగా రవాణా చేస్తున్న నిందితుడిని విజయవంతంగా పట్టుకొన్నారు.ఒక వ్యక్తి తన వ్యక్తిగత లాప్ టాప్ లో  రహస్యంగా దాచి ఉంచిన మాదక మాత్రలను దాచినట్లు పసిగట్టిన విధులు నిర్వహిస్తున్న అధికారులు గుర్తించారని ఎయిర్ కస్టమ్స్ యాక్టింగ్  డైరెక్టర్ తెలిపారు. దీనితో ఆ మాదక ద్రవ్యాల  అక్రమ రవాణా వ్యాపారిని అదుపులోనికి తీసుకొని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వద్దకు ఆ అధికారి సిఫార్సు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com