ఐసీఐసీఐ బ్యాంకు 'ఈజీ పే' యాప్ ప్రారంభం
- December 27, 2016
ఐసీఐసీఐ బ్యాంకు వ్యాపారుల కోసం రూపొందించిన 'ఈజీ పే' యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా వినియోగదారుల నుంచి వ్యాపారులు ఎంత మొత్తమైనా డిజిటల్ పద్ధతిలో స్వీకరించవచ్చు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఆధారంగా పనిచేసే ఈ యాప్.. క్రెడిట్, డెబిట్, ఆన్లైన్ బ్యాంకింగ్, ఐసీసీఐ డిజిటల్ వాలెట్ 'పాకెట్' నుంచి చెల్లింపులు జరిపేందుకు వీలు కల్పిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంకు కరెంట్ ఖాతాదారులు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని వాడవచ్చు.ఇతర బ్యాంకుల వినియోగదారులు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ఓఎస్ స్మార్ట్ ఫోన్లపై ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురాగా, త్వరలో ఐఓఎస్ ఫోన్లకు ప్రవేశపెట్టనున్నారు.ఒక వ్యాపారికి సంబంధించి 30 మంది ఉద్యోగులు ఒకేసారి ఈ యాప్ ద్వారా తమ మొబైల్ ఫోన్లలో చెల్లింపులను స్వీకరించవచ్చని ఐసీఐసీఐ సీఈవో చందా కొచ్చర్ చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!







