బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- October 02, 2026
మనామా: డ్రగ్స్ అక్రమ రవాణా ద్వారా వచ్చిన BD482,199 మొత్తాన్ని మనీలాండరింగ్ చేసిన కేసులో నలుగురు ఆసియా దేశాలకు చెందిన వ్యక్తులకు బహ్రెయిన్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తయిన అనంతరం వారిని శాశ్వతంగా దేశం నుంచి బహిష్కరించాలని కూడా ఆదేశించింది.
డ్రగ్స్ విక్రయాల ద్వారా వచ్చిన డబ్బును బహ్రెయిన్‌తో పాటు ఇతర దేశాల్లోని బ్యాంకు ఖాతాల ద్వారా స్వీకరించడం, బదిలీ చేయడం, ఆ మొత్తానికి చట్టబద్ధమైన ఆదాయ వనరుగా కనిపించేలా ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం వంటి చర్యలకు నిందితులు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ నలుగురు పెద్ద డ్రగ్స్ అక్రమ రవాణా నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్నారని అధికారులు తెలిపారు. నెట్‌వర్క్‌లో కొందరు డ్రగ్స్ విక్రయాలు, పంపిణీ చేయగా.. మరికొందరు వాటి ద్వారా వచ్చిన డబ్బును స్వీకరించి విదేశాలకు బదిలీ చేసేవారని పేర్కొన్నారు.
డ్రగ్స్ అక్రమ రవాణా కేసులపై పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు చెందిన డ్రగ్ క్రైమ్స్ యూనిట్ దర్యాప్తు చేపట్టింది. మరోవైపు నేషనల్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ డబ్బు లావాదేవీలను ట్రాక్ చేసి, ఈ నలుగురితో పాటు మరో ఇద్దరు కూడా మనీలాండరింగ్‌లో పాల్గొన్నట్లు గుర్తించింది.
దీంతో ఫైనాన్షియల్ అండ్ మనీలాండరింగ్ క్రైమ్స్ ప్రాసిక్యూషన్ తదుపరి దర్యాప్తు చేపట్టింది. నిందితుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి బదిలీ అయిందన్న వివరాలను అధికారులు పరిశీలించారు.
నిందితుల మొబైల్ ఫోన్లలో లభించిన మెసేజ్‌లు, ఆడియో రికార్డింగులను కూడా పరిశీలించారు. వాటిలో డ్రగ్స్ విక్రయం, సరఫరాకు సంబంధించిన సమాచారంతో పాటు డబ్బు స్వీకరణ, బదిలీకి సంబంధించిన పత్రాలు ఉన్నట్లు గుర్తించారు.
దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన కోర్టు.. నలుగురు నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు, ఒక్కొక్కరికి BD100,000 జరిమానా విధించింది. జైలు శిక్ష పూర్తయిన తర్వాత వారిని శాశ్వతంగా బహ్రెయిన్ నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. అలాగే నిందితుల ఆస్తులు, నగదును కూడా కోర్టు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







